కళ & కష్టం గురించి -Poem
* రాత్రి నీరవ నిశబ్ద కవచాలను తొడుక్కొని కోడిపెట్టే గుడ్లను పొదిగినట్లు కలల్ని పొదుగుతున్నప్పుడు ఎటు నుండో ఒక శబ్దం ష్... ష్... మని వినపడుతుంది * రోడ్ల మీద మనుషులు పొర్లుతారు వీధులన్నీ టాయిలెట్స్ గా మార్చుకొని దేశాన్ని భ్రష్ట్రు పట్టిస్తారు ఆమె మాత్రం సూర్యుడిని కన్నుల్లో నింపుకొని రోడ్లను ప్రేమగా, తల్లిలా శుభ్రపరుస్తుంది * ఇంతకీ తన చేతులో ఉన్నదేమిటి? * పొద్దున్నే కిటికీ తెరిచి చూడగానే సూర్యకిరణాలను పరక పుల్లలుగా మార్చే విద్యను ఆమె నుండే నేర్చుకున్నాను * తన చేతులో ఉన్నది పరకంటే ఒప్పుకోను అదీ శ్రమాయుధం
* At night a sound sh... Sh... I hear that men warp on the roads convert all the streets into toilets and corrupts the country She blinds the sun and cleans the roads lovingly and mother* What is in her hand? * I learned from her the education of turning the sun s rays into pale leaves* What is in her hand is a conviction than heaven.